amp pages | Sakshi

భారత్‌కు మరో రెండు రజతాలు, ఓ కాంస్యం

Published on Fri, 04/13/2018 - 17:44

గోల్డ్‌కోస్ట్‌ : కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతోంది. తొమ్మిదో రోజు పోటీల్లో మహిళల డబుల్స్‌ టేబుల్‌ టెన్నిస్‌(టీటీ), పురుషుల 75 కేజీల బాక్సింగ్‌ విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు దక్కగా.. పురుషుల బాక్సింగ్‌ 69 కేజీల విభాగంలో ఓ కాంస్యం సొంతమైంది. 

శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్లో మనిక బాత్రా, మౌమా దాస్‌ల జోడి టియాన్వీ ఫెంగ్ ,మెంగువు యు( సింగఫూర్‌)  ద్వయం చేతిలో పరాజయం పొందడంతో రజత పతకం సొంతమైంది. పురుషుల 75 కేజీల సెమీ ఫైనల్లో భారత బాక్సర్‌ వికాస్‌ క్రిషన్‌ యాదవ్‌  స్టీవెన్‌.. డానెల్లీ( ఇంగ్లండ్‌)పై గెలిచి ఫైనల్‌కు చేరాడు. దాంతో కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుని తుది పోరుకు అర్హత సాధించాడు.. పురుషుల బాక్సింగ్‌ 69 కేజీల విభాగం సెమీ ఫైనల్లో మనోజ్‌కుమార్‌ ప్యాట్‌ మెక్‌కార్మాక్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓడిపోవడంతో కాంస్యం చేజిక్కింది. 

ఇక అంతక ముందు పురుషుల రెజ్లింగ్‌ 97 కేజీల ఫ్రీ  స్టైల్‌ విభాగంలో భారత రెజ్లర్‌ మౌసమ్‌ ఖత్రీ రజతం సాధించగా.. 50 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఈవెంట్లో భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్‌ స్వర్ణానికి గురి పెట్టగా, అంజుమ్‌ రెండు పాయింట్ల తేడాతో రజతం పతకం సొం‍తం చేసుకొంది.  రెజ్లింగ్‌లో 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్‌ బజరంగ్ పునియా బంగారు పతకం సాధించగా.. భారత మహిళా రెజ్లర్ పూజా ధండా  ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. దీంతో భారత్‌ ఖాతాలో 17 స్వర్ణం, 11 రజతం, 14 కాంస్యలతో 42 పతకాలు చేరాయి.

సెమీస్‌లో ఓడిన పురుషుల హాకీ జట్టు
ఇక భారత్‌ పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లె 2-3 తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం పొందింది. కాంస్య పతకం కోసం రెండో సెమీఫైనల్లో తలపడే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్లలో ఓడిన జట్టుతో పోటీపడనుంది. ఇక మహిళల హాకీ జట్టు సైతం కాంస్యం కోసం ఇంగ్లండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే.

Videos

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?